రెసిడెన్షియల్‌కు సంబంధించి నంద్యాల మండలం నూనెపల్లెలో గజం భూమి విలువ సుమారు రూ.4,800 ఉండగా దాని విలువలో 35శాతం పెరిగితే రూ.6,480 అవుతుంది. అదే విధంగా ఆత్మకూరు పట్టణం వీరభద్ర థియేటర్ ఏరియాలో గజం భూమి విలువ రూ.2 వేలు ఉండగా 35శాతం పెరిగితే రూ.2,700 అవుతుంది. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో గజం భూమి విలువ రూ.1,100 కాగా 35శాతం పెంచితే రూ.1,485గా ఉంటుంది.
● కమర్షియల్‌కు సంబంధించి నంద్యాల పట్టణం కల్పనా సెంటర్, షరాఫ్ బజార్, ఎన్‌కే రోడ్డు, బైర్మల్‌వీధి, శ్రీనివాసనగర్, రాజ్ థియేటర్, సంజీవనగర్ ఏరియాలో రెండు సెంట్ల స్థలంలో ఇల్లు ఉంటే ప్రస్తుత విలువ ప్రకారం ఆర్‌సీసీ మిద్దె విలువ రూ.36.40 లక్షలు కాగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 7.5 చలానా రూపంలో రూ.2.73 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. పెరిగిన విలువ ప్రకారం రెండు సెంట్లలో ఆర్‌సీసీ మిద్దె విలువ 46.66 లక్షలు, దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 7.5 చలానా రూపంలో 3.43 లక్షలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. అంటే అదనంగా రూ.70 వేలు భారం ఇంటి యజమానిపై పడనుంది. ఇది కాకుండా మున్సిపాలిటీలో ఉన్న పన్ను పేరు మార్పు కోసం అదనంగా ఒక శాతం మ్యూటేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment