త్రివిక్రమ వర్మకు నివాళి
అవుకు: గుండెపోటుతో సోమవారం రాత్రి మృతిచెందిన రాజవంశీయుడు నంద్యాల త్రివిక్రమ వర్మ అంత్యక్రియలు బుధవారం అవుకులో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి అవుకులోని రాజుగారి స్వగృహానికి చేరుకుని వర్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అవుకు సామ్రాజ్యాన్ని పాలించే కాలంలో వారి పూర్వీకులు అవుకుకు ఎనలేని సేవలనందించారని గుర్తుచేశారు. అనంతరం త్రివిక్రమ వర్మ భార్య భాగవతి, కుమారుడు అభినాష్ ప్రశాంత్ వర్మలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు పండ్ల వాయునందన గౌడ్, బలిజ సంఘం నాయకుడు రామన్న, గ్యాంగ్ దస్తగిరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment