రైతులకు అవసరం మేరకు యూరియాను పంపిణీ చేయడంలో కూటమి సర్కారు విఫలమైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని విమర్శించారు. అధికారపార్టీ నాయకులు, కొందరు దళారులు యూరియా కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని, బస్తాపై రూ.150–200 అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. దీంతో సామాన్య రైతులకు యూరియా కొనుగోలు భారమైందన్నారు. ఇప్పటికై నా సర్కారు స్పందించి రైతులకు అవసరం మేరకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెట్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, నంద్యాల జిల్లా పంచాయతీ రాజ్ అధ్యక్షడు రామలక్ష్మీయ్య, పిన్నాపురం సర్పంచ్ ఎల్లక్రిష్ణయ్య , కందికాయపల్లె సర్పంచ్ రామచంద్రుడు, శేషారెడ్డి, బాలిరెడ్డి, శేషు, రామకిట్టు, జయచంద్రారెడ్డి, శేషయ్య, చందమామబాబు, సుమంత్‌రెడ్డి, అమర్నాఽథ్‌రెడ్డి , గగ్గటూరు శ్రీనివాసరెడ్డి,సత్యాలు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment