కర్నూలు(సెంట్రల్): శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించిన విద్యార్థికి న్యాయం జరిగిందని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్ తెలిపారు. నంద్యాలకు చెందిన పి.వంశీ అనే విద్యార్థి 2022లో ఆర్‌జీఎం కాలేజీలో ఇంజినీరింగ్ చేరాడు. అయితే అతను 6 నెలలు మాత్రమే కాలేజీకి వచ్చి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగంలో చేరేందుకు యత్నించాడు. అయితే కళాశాలలోనే టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు ఉండడంతో యాజమాన్యం నాలుగు సంవత్సరాలకు సంబంధించిన రూ.3 లక్షలు కడితే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పారు. అతను శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించాడు. ఈ కేసులో ప్రతివాది ఆర్‌జీఎం కళాశాలకు శాశ్వత లోక్ అదాలత్ జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకట హరినాథ్, సభ్యులు శివశంకర్‌రెడ్డి, రాజుబాబుల ఆధ్వర్యంలో బెంచ్ నోటీసులు ఇచ్చి రాజీకుదర్చాయి. దీంతో బుధవారం పి.వంశీకి సర్టిఫికెట్లను ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment