ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
పత్తికొండ రూరల్: ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయని ఉద్యానవన శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి అన్నారు. పత్తికొండ రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులకు ఉద్యాన పంటల సాగు, ప్రోత్సాహకాలు తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ పండ్లతోటలు ఉన్న రైతులకు ప్యాక్ హౌస్‌కు రూ.2 లక్షలు, పాంఫౌండ్ నిర్మాణానికి రూ.75 వేలు, ఉల్లి నిల్వ గోడౌన్‌కు రూ.80 వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. అనంతరం సూక్ష్మ సేద్య పథకం గురించి వివరించారు. బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ వస్తుందన్నారు. బీసీ రైతులకు 90శాతం సబ్సిడీతో పరికరాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు దస్తగిరి, జయరామిరెడ్డి, నాగసునీల్, ఖాజాహుసేన్, డీలర్లు పాల్గొన్నారు.
అహోబిలేశుడి సేవలో..
ఆళ్లగడ్డ: అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్లను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ రామ్‌సింగ్ బుధవారం దర్శించుకున్నారు. అహోబిలం చేరుకున్న ఆయనకు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాల్లోని స్వామ, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట నంద్యాల ఈఈ శ్రీనిసారెడ్డి, ఆళ్లగడ్డ డీఈఈ రవికాంత్‌చౌదరి ఉన్నారు.
మాతృ మరణాల శాతం
తగ్గించాలి
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో మాతృ మరణాల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ అన్నారు. బుధవారం ఆమె తన చాంబర్‌లో మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. కల్లూరు, నన్నూరు, హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సంభవించిన మూడు మాతృమరణాలపై ఆమె వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఆశా, ఆరోగ్య కార్యకర్త, వైద్యాధికారులు గర్భిణులను గుర్తించి వారికి సకాలంలో వైద్యసేవలు అందించినట్లయితే తల్లుల మరణాల శాతం తగ్గించవచ్చన్నారు. ఒకవేళ హైరిస్క్ గర్భిణులను గుర్తించి సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందించాలన్నారు. సమావేశంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనకాలజీ హెచ్‌వోడి డాక్టర్ పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్గర్ సుగుణ, డాక్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment