సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌ను సవరించైనా ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించాలన్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్ల కోసం నిధులను సాధించడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కడప స్టీలు ప్లాంటు కోసం నిధులను రాబట్టడంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లను కేటాయించాలన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వలసల నివారణకు వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. వామపక్ష పార్టీల నాయకులు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, రాముడు, విజయ్, షరీప్, అబ్దుల్‌దేశాయ్, రామకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట వామపక్షాల
ఆధ్వర్యంలో ధర్నా
Comments
Please login to add a commentAdd a comment