అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. ఇసుక, మట్టి, బియ్యం దందాను వదలడం లేదు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. గుడి, బడి తేడా లేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చివరకు చిరు వ్యాపారులను సైతం వేధిస | - | Sakshi
Sakshi News home page

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. ఇసుక, మట్టి, బియ్యం దందాను వదలడం లేదు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. గుడి, బడి తేడా లేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చివరకు చిరు వ్యాపారులను సైతం వేధిస

Published Fri, Mar 14 2025 1:27 AM | Last Updated on Fri, Mar 14 2025 1:26 AM

అహోబిలం దేవస్థానాన్నీ వదలని

టీడీపీ నాయకులు

అడుగడుగునా అక్రమ వసూళ్లు

ఒక్కో దుకాణానికి రూ.10 వేల

చొప్పున చెల్లించిన చిరు వ్యాపారులు

సుమారు 110 దుకాణాల నుంచి

రూ.11 లక్షల మేర దోపిడీ

టోల్‌గేట్‌ పేరుతో

భక్తుల నుంచి అధిక వసూళ్లు

అక్రమ వసూళ్లన్నీ

ఓ ప్రజాప్రతినిధి భర్త ఖాతాలోకి ?

భారీగా టోల్‌ వసూలు

కేవలం రూ.19 లక్షలకే టోల్‌ గేట్‌ దక్కించుకున్న నిర్వాహకులు ఈ మేరకు వాహనదారులకు మినహా యింపు ఇవ్వాల్సి ఉంది. కానీ, కూటమి నాయకులు అధికార అండదండలతో ఇష్టానుసారం టోల్‌ వసూలు చేస్తున్నారు. భారీ వాహనాలు, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, టెంపో ట్రావెల్స్‌కు ఒక్కోదానికి రూ.100.. కార్లు, జీపులకు రూ.75, ఆటోలకు రూ.40, తోపుడుబండ్లకు రూ.30 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ, వాహనంతో సంబంధం లేకుండా వాహనదారులను విపరీతంగా బాదేస్తున్నారు. కారు, బస్సు, ట్రాక్టర్‌తో సంబంధం లేకుండా ప్రతీ వాహనానికి రూ.150 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పది మంది మనుషులను పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని భక్తులు వాపోతున్నారు. టోల్‌ గేట్‌ వద్ద రేట్ల పట్టికను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పక్కన పెట్టేశారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శి తనకేమీ పట్టనట్లు వ్యహరిస్తుండడం గమనార్హం.

వైపు అంగరంగ వైభవంగా అహోబిలేశు డిని బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. మరో వైపు కూటమి నేతలు గుట్టుగా వసూళ్లకు పాల్పడుతు న్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే ఏర్పాట్లలోనూ అక్రమాలకు పాల్పడిన నేతలు ఇప్పుడు అటు భక్తులు, ఇటు చిరు వ్యాపారులను దోచుకుంటున్నారు. కళ్ల ముందే అక్రమ తంతు సాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి అహోబిలేళుడి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. స్వామి వారిని కనులారా తిలకించి మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా అహోబిలం క్షేత్రానికి సుమారుగా మూడు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ క్రమంలో కూటమి నేతలు వసూళ్ల అంగడి తెరిచారు. ఉత్సవాల సందర్భంగా దిగువ అహోబిలంలో దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఏటా దుకాణానికి చాలా తక్కువ మొత్తంలో చెల్లించి వ్యాపారం చేసుకుని అంతో ఇంతో సంపాదించుకునే వారు. గతేడాది వీటి ద్వారా ఆలయానికి కేవలం రూ.26 వేలు మాత్రమే ఆదాయం వచ్చింది. అయితే టీడీపీ నాయకుల కన్ను ఈ దుకాణాల పడింది. ఆలయానికి రూ.48 వేలు ఇచ్చేసి దుకాణాల దారుల నుంచి తాము వసూలు చేసుకుంటామని ఆదేశాలు ఇచ్చుకున్నారు. ఏపీ టూరిజం అతిథి భవనం, టీటీడీ సత్రం, పాత సచివాలయం, బీగాల ఆంజనేయస్వామి ఆలయం వద్ద సుమారుగా 110 మంది దుకాణాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. చిరు వ్యాపారుల వద్ద నుంచి అడుగుకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. ఒక్కో దుకాణాన్ని పది అడుగుల మేర స్థలం మార్కు వేసి రూ. 10 వేలు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మొత్తంగా 110 షాపులకు రూ.11 లక్షల మేర డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ డబ్బంతా స్థానిక ప్రజాప్రతినిధి భర్త జేబులోకి వెళుతోందని గ్రామ టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు.

డబ్బులు ఇవ్వకపోవడంతో దాడి

స్వామి ఉత్సవాల సందర్భంగా పిల్లలు ఆడుకునేందుకు ఓ వ్యక్తి చిన్న ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసుకుంటే దీన్ని వదల్లేదు. తమకు రూ.40 వేలు ఇచ్చిన తర్వాతే ఎగ్జిబిషన్‌ పెట్టుకోవాలని స్థానిక నేత ఒకరు హుకుం జారీ చేశారు. మొదటి విడతలో రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన మొత్తం ఇచ్చేందుకు ఆలస్యమవడంతో అతన్ని చితకబాదారు. తమకు డబ్బులు ఇవ్వకుండా ఇక్కడి నుంచి ఒక్క అడుగు బయటికి వెళ్లలేవని బెదిరించడంతో భయభ్రాంతులకు గురైన బాధితుడు మిగిలిన మొత్తాన్ని ఇచ్చి బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.

పంచాయతీ ఆదాయానికి గండి

అహోబిలం పంచాయతీ ఆదాయానికి టీడీపీ నాయకులు గండి కొడుతున్నారు. ఆలయానికి వెళ్లేందుకు గ్రామం వెలుపల టోల్‌ గేట్‌ ఏర్పాటు చేశారు. ఏటా వేలంలో పాడుకోవాల్సి ఉంది. ఎవరు ఎక్కువ మొత్తానికి పాడుకుంటే వారికే టోల్‌ గేట్‌ నిర్వహణ ఇస్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో ఏడాది పాటు టోల్‌ గేట్‌ వసూళ్ల కోసం వేలం నిర్వహిస్తే గోర్ల సుబ్బారావు అనే వ్యక్తి రూ.41 లక్షలకు పాడుకున్నాడు. ఈ మొత్తాన్ని పంచాయతీకి జమ చేశాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25కు సంబంధించి వేలం పాట నిర్వహిస్తే కేవలం ఒక్కరే వేలంలో పాల్గొన్నాడు. ఇతరులను ఎవరినీ లోనికి కూడా అనుమతించకుండా డోర్లు వేసి మరీ పాట దక్కించుకున్నాడు. ఏడాదికి కేవలం రూ.19 లక్షలకే చింతలపల్లి నవీన్‌ అనే వ్యక్తి పాడుకున్నాడు. పంచాయతీకి ఏడాదికి రూ.22 లక్షల ఆదాయానికి గండి కొట్టారు. వచ్చే నాలుగేళ్లు ఈ తంతు ఇలానే కొనసాగనుంది.

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి 1
1/4

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి 2
2/4

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి 3
3/4

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి 4
4/4

అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని కూటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement