
అన్ని హంగులతో గురుకుల పాఠశాల నిర్మించాలి
మద్దూరు: అన్ని హంగులతో కూడిన ఎస్సీ గురుకుల పాఠశాల భవనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఏ. తిరుపతిరెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు పట్టణంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.30 కోట్లతో చేపట్టే గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు, అలాగే నర్సింహస్వామి ఆలయం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ భవన నిర్మాణం నమూనాను ఈఈ రాంచందర్ వారికి వివరించగా.. వచ్చే విద్యాసంవత్సరం వరకు భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు నెలకు రూ.50వేలు గౌరవ వేతనం వచ్చేలా చూడాలని పలువురు వారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేష్‌రెడ్డి, హన్మిరెడ్డి, మల్లీకార్జున్, రహీం, వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment