మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా కేంద్రం నుంచి ఆరుగురు బాధితులకు శుక్రవారం ఎస్పీ డి.జానకి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. భరోసా కేంద్రం ఎస్‌ఐ సుజాత పాల్గొన్నారు.
● హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయంలో భాగంగా ఐదుగురు హోంగార్డ్స్‌కు ఎస్పీ జానకి చెక్కులు అందజేశారు. కవితకు రూ.15,000, శేఖరయ్య, వెంకట్రాములు, నాగమణి, శోభకు రూ.10 వేల చొప్పున చెక్కులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment