Omicron Updates In India: 200 Omicron Cases Registered, Check State Wise Cases - Sakshi
Sakshi News home page

Omicron Variant: భారత్‌లో 200కు చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

Published Tue, Dec 21 2021 11:49 AM | Last Updated on Tue, Dec 21 2021 12:40 PM

200 Omicron Cases Recorded in India: Health Ministry - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఇంకా పూర్తిగా తగ్గకముందే కొత్త వేరియంట్‌ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది.

దేశంలో ఇప్పటి వరకు 200 మంది ఒమిక్రాన్‌ బారిన పడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. వీరిలో 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది. దేశంలో 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూడగా...వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌ 18, కేరళ 15, గుజరాత్‌ 14, ఉత్తరప్రదేశ్‌ 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement