న్యూఢిల్లీ : మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదివేందుకు చేసుకున్న దరఖాస్తును కళాశాల అధికారులు తిరస్కరించారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కు మారి త్యాగి(77) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) పెట్టిన 30 ఏళ్ల వయో పరిమితి నిబంధన తనకు గల రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి గరిష్ట వయోపరిమితి 20, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 30 ఏళ్ల వయోపరిమితి విధిస్తూ బీసీఐ ఇటీవల నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తమకున్న ఎస్టేట్‌ను కాపాడుకోవడానికి లా చదవాలని అనుకుంటున్నట్లు సాహిబా బాద్‌కు చెందిన రాజ్‌కుమారి త్యాగి పేర్కొన్నారు. బీసీఐ నిబంధనలతో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు, ఏ వృత్తినైనా చేపట్టే హక్కు, జీవించే హక్కులకు భంగం కలుగుతున్నాయని ఆ పిటిషన్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment