
నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా కోవిడ్ బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. శుక్రవారం చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
చదవండి👉 CAA అమలు చేయం. అంతే!: తేల్చిచెప్పిన కేరళ సీఎం విజయన్