శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి రామభక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా రామభక్తులు తరలివస్తున్నారు. లండన్‌కు చెందిన మహిళల బృందం ఇప్పటికే అయోధ్య చేరుకుంది. వారిలో కొందరు మనస్తత్వవేత్తలు, మరికొందరు జీవశాస్త్రవేత్తలు ఉన్నారు. వీరు సాధ్విలుగా మారారు. వీరంతా తమ ఉద్యోగాలను వీడి, సన్యాసం స్వీకరించారు. సాధ్వి అవధి మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో అయోధ్యకు వచ్చానని, ఇప్పుడు రామ్‌లల్లా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని తెలిపారు.
అయోధ్యకు తరలివచ్చిన సాధ్వి అవక్షి మాట్లాడుతూ ‘తామంతా సాధ్విలం, అశుతోష్మావారి అనుచరులం. రామ్‌లల్లా పవిత్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చాం. ఇది సనాతనీయులకు అపూర్వమైన రోజు. దీని వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం ఉంది. ఇప్పుడు ప్రపంచ వేదికపై హిందువులు బహిరంగంగా ఉత్సవం జరుపుకునే అవకాశం వచ్చిందని’ అన్నారు.
సాధ్వి గాబ్రియేల్ మాట్లాడుతూ ‘నాలోని భక్తే నన్ను రామ్‌లల్లాకు దగ్గర చేసింది. అందరూ అయోధ్య రాముని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సానుకూల శక్తి అపారంగా ఉంది. కొన్ని యుగాలుగా మనకు మార్గదర్శకంగా నిలిచిన రామాయణం, హిందూ సంస్కృతి, వేదాలు, మంత్రాలు మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. సాధ్వి అవక్షి డబుల్ పీహెచ్‌డీ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ విభాగంలో ఫిజియాలజిస్ట్‌గా పనిచేశారు. ఆమె తన ఉద్యోగాన్ని వదులుకొని సాధ్వీగా మారారు. గాబ్రియెల్.. బ్రిటన్‌లో జీవశాస్త్రవేత్తగా పనిచేశారు. పదవీ విరమణ పొందాక, సాధ్విగా మారారు.
ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం!
Comments
Please login to add a commentAdd a comment