జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులది కీలక పాత్ర. ‘చెట్లే మనిషికి గురువులు’ అన్నారు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అతడికి ఆధారం భూమే. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల్లో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది.
ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యంతో రూపొందిన పారిస్ వాతావరణ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు భారత్ కంకణం కట్టుకుంది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. మనదేశంలో అనేక పవిత్ర నదులు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. అలాగే
ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభించాల్సి ఉంది. అందుకే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్ ’ ద్వారా పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే ‘గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ ద్వారా దేశ యువతకు సరికొత్త ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రేమ, తపన ఉంటే చాలు. పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యత. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకుంటే భావితరాలు పచ్చగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment