
కయ్యర్ కిన్హన్న రాయ్ స్వాతంత్య్ర సమరయోధులు, రచయిత, కవి, పాత్రికేయుడు, ఉపాధ్యాయుడు, రైతు. రాయ్ 1915 జూన్ 8 న తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. 12వ ఏటే ‘సుశీల’ అనే చేతిరాత పత్రికను ప్రచురించారు. మహాత్మాగాంధీ వల్ల ప్రభావితులై భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు.
ఆయన భార్య ఉన్యక్క. ఎనిమిది మంది సంతానం. రాయ్ సెకండరీ స్కూల్ టీచర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. జర్నలిజంలో ప్రావీణ్యం ఉంది. స్వాభిమానం, మద్రాస్ మెయిల్, ది హిందూ వంటి వార్తాపత్రికలకు రచనలను అందించాడు. 1969లో ఉత్తమ ఉపాధ్యాయునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
నాటకరంగం, వ్యాకరణం, పిల్లలపై పుస్తకాలు రాసిన రచయిత, కవి. ఆయన రచించిన కొన్ని ప్రసిద్ధ కవితలు శ్రీముఖ, ఐక్యగణ, పునర్ణవ, చేతన, కోరగా. అలాగే కన్నడ కవి గోవింద పాయ్ జీవిత చరిత్రను రచించారు. కయ్యర్‌కు మంగళూరు విశ్వవిద్యాలయం 2005 లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
మంగళూరులో జరిగిన 66వ అఖిల కన్నడ సాహిత్య సమ్మేళనానికి (కన్నడ సాహిత్య సదస్సు) ఆయన అధ్యక్షత వహించారు. పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన పాదువారిల్లి పండవారు అనే కన్నడ చిత్రానికి ఆయన రాసిన కొన్ని కవితల్ని పాటలుగా ఉపయోగించారు. రాయ్ ఆసక్తిగల వ్యవసాయదారుడు.
అరేకా, రబ్బరు, బియ్యం సాగులో మెళకువలు కనిపెట్టారు. రాయ్ తన 100 వ ఏట కేరళలోని కాసరగోడ్ , బదియాడ్కా సమీపంలోని కల్లాకాలియాలో తన నివాసంలో వృద్ధాప్యం కారణంగా 2015 ఆగస్టున సహజ మరణం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment