
సామ్రాజ్య భారతి 1864/1947
జననాలు
కామినీ రాయ్, స్వామీ అఖండానంద జన్మించారు. కామిని బెంగాలీ రచయిత్రి. సామాజిక కార్యకర్త, స్త్రీవాది. బ్రిటిష్ ఇండియాలో ఆనర్స్‌లో డిగ్రీ చేసిన తొలి మహిళ. బంగ్లాదేశ్‌లోని ఝలోకటిలో జన్మించారు. స్వామి అఖండానంద రామకృష్ణ పరమహంస శిష్యులు. రామకృష్ణ మిషన్‌కు మూడవ అధ్యక్షులు. కలకత్తాలో జన్మించారు.
ఘట్టాలు
సిమ్లాను బ్రిటిష్ ఇండియా వేసవి రాజధానిగా బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. జర్మన్–బ్రిటిష్ వృక్షశాస్త వేత్త డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసును ఏర్పాటు చేశారు. విద్యావేత్త సర్ సయ్యడ్ అహ్మద్ ఖాన్ ‘సైంటిఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ను నెలకొల్పారు.
చట్టాలు
ఇండియన్ టోల్స్ యాక్ట్, నేవల్ ప్రైజ్ యాక్ట్, ఇండియా ఆఫీస్ సైట్ యాక్ట్ అమల్లోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment