
ఒరిస్సా దుర్భిక్షంలో 4 కోట్ల 70 లక్షల జనాభా ఆకలితో అలమటించారు. 45 లక్షల మంది మరణించారు.
ఘట్టాలు
► ఒరిస్సా దుర్భిక్షంలో 4 కోట్ల 70 లక్షల జనాభా ఆకలితో అలమటించారు. 45 లక్షల మంది మరణించారు.
► దాదాభాయ్ నౌరోజీ లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్‌ను స్థాపించారు.
► ఐరోపా సేనల కోసం బ్రిటిష్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లోని డల్‌హౌసీ కంటోన్‌మెంట్‌ను, బక్లో ప్రాంతాన్ని 5 వేల రూపాయలకు కొనుగోలు చేసింది.
► భారతీయ సైనికులకు తొలిసారిగా ప్రమోషన్ ఇవ్వడం మొదలైంది. అప్పటి వరకు వారు సుబేదార్‌లు గానే ఉండేవారు.
జననాలు
గోపాలకృష్ణ గోఖలే, హైదరాబాద్ నిజామ్ ఆరవ అసఫ్ జాహీ (మహబూబ్ అలీ ఖాన్), కాళహస్తి జమీందార్ పానగల్ రాజా, కచ్ స్టేట్ మహారాజా ఖేంగర్‌జీ, శ్యామానంద్ ముఖోపాధ్యాయ (గణిత శాస్త్రజ్ఞుడు), చలన చిత్ర ఛాయాగ్రహకుడు హీరాలాల్ సేన్ జన్మించారు.