ఢిల్లీ: ముస్లీం లీగ్ పూర్తిగా సెక్యులర్ పార్టీ అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు దేశంలో ఇంకా మద్దతు దొరకడం దురదృష్టకరమని అన్నారు. మతం పేరిట దేశం రెండుగా విడిపోవడానికి ముస్లిం లీగ్ కారణమనే అంశాన్ని ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు.
అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‍లో ముస్లిం లీగ్‌తో కాంగ్రెస్ పొత్తుపై విలేఖరి అడిగిన ప్రశ్నకు 'ముస్లీం లీగ్ పూర్తిగా లౌకికమైనది. ఆ పార్టీని సరిగా అర్థం చేసుకోలేనివాళ్లే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని అన్నారు.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూడీఎఫ్‍లో ముస్లీం లీగ్ మిత్రపక్షంలో ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయకముందు..వయనాడ్ నుంచే ఎంపీగా ప్రాతనిథ్యం వహించారు.
'మత ప్రాతిపదికన భారతదేశ విభజనకు కారణమైన జిన్నా 'ముస్లిం లీగ్'ను.. రాహుల్ గాంధీ 'సెక్యులర్' అని అంటున్నారు. చరిత్రను రాహుల్ సరిగా చదవలేదు' అని బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
చదవండి:పాకిస్తాన్ కంటే భారత్ ఆ విషయంలో చాలా బెటర్... ఆ మాటకొస్తే చైనా కూడా ఎందుకూ పనికిరాదు...
Comments
Please login to add a commentAdd a comment