టార్గెట్‌ @ 2024.. సోనియా మరో సంచలన నిర్ణయం | Congress formed three groups Amid Of General Elections | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ @ 2024.. సోనియా మరో సంచలన నిర్ణయం

Published Tue, May 24 2022 2:17 PM | Last Updated on Tue, May 24 2022 3:18 PM

Congress formed three groups Amid Of General Elections - Sakshi

సంస్థాగత మార్పులే లక్ష్యంగా ఇటీవలే రాజస్థాన్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. 

ఎన్నికల కోసం టాస్క్‌ఫోర్స్ 2024 ను సోనియా గాంధీ మంగ‌ళ‌వారం వెల్లడించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో స్థానం కల్పించగా.. అత్యంత కీల‌క‌మైన టాస్క్‌ఫోర్స్‌ క‌మిటీలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీకి స్థానం ద‌క్కింది. కాగా, చింత‌న్ శిబిర్‌లో ప్రియాంక గాంధీని అధ్య‌క్షురాలు చేయాల‌ని ఒక్క‌సారిగా డిమాండ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాస్క్‌ఫోర్స్ క‌మిటీలో ప్రియాంక‌కు స్థానం ద‌క్క‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక ఈ కమిటీల్లో అసమ్మతి నేతల(జీ-23)కు సైతం చోటుదక్కడం విశేషం.
 
మరోవైపు.. క‌శ్మీర్ నుంచి క‌న్యా కుమారి వ‌ర‌కూ దేశ వ్యాప్తంగా రాహుల్ పాద‌యాత్ర(భార‌త్ జోడే యాత్ర) చేయాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వున్న నిరుద్యోగ స‌మ‌స్య‌ను హైలెట్ చేయాల‌ని నిర్ణ‌యించింది.  భారత్‌ జోడే  యాత్రకు సంబంధించి కూడా సోనియా ఓ క‌మిటీని ప్ర‌క‌టించారు.

కమిటీల్లో సభ్యులు వీరే.. 

పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ.. 
- రాహుల్ గాంధీ
- గులాంన‌బీ ఆజాద్‌
- దిగ్విజ‌య్ సింగ్‌
- మ‌ల్లికార్జున ఖ‌ర్గే
- కేసీ వేణుగోపాల్‌
- అంబికా సోనీ
- ఆనంద్ శ‌ర్మ‌
- జితేంద్ర సింగ్‌.

టాస్క్‌ఫోర్స్ 2024 క‌మిటీ.. 
- ప్రియాంక గాంధీ
- కేసీ వేణుగోపాల్‌
- ర‌ణ‌దీప్ సూర్జేవాలా
- చిదంబ‌రం
- ముకుల్ వాస్నిక్‌
- జ‌య‌రాం ర‌మేశ్‌
- అజ‌య్ మాకెన్‌
- సునీల్ క‌నుగోలు 

భార‌త్ జోడే పాద‌యాత్ర క‌మిటీ
శ‌శి థ‌రూర్‌
- స‌చిన్ పైల‌ట్‌
- దిగ్విజ‌య్ సింగ్‌
- కేజే జార్జ్‌
- రంవీత్ సింగ్ బిట్టూ
- ప్ర‌ద్యుత్ బోల్‌దోలోయీ
- జీతూ ప‌ట్దారి
- స‌లీమ్ అహ్మ‌ద్‌

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఎస్పీజీ కంట్రోల్‌లో ఐఎస్‌బీ! సోషల్‌ మీడియా జల్లెడ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement