
సాక్షి, అమరావతి: ఒడిశా-బెంగాల్ తీరంపై అతి తీవ్ర యాస్ తుఫాన్ విరుచుకుపడుతోంది. ఒడిషాలోని భద్రక్ జిల్లాలో ఉన్న ధమ్ర పోర్టుకు సమీపంలో తీరాన్ని తాకిన యాస్ తుఫాన్.. మధ్యాహ్నం తర్వాత ధమ్రా పోర్టు - బాలాసోర్ మధ్య తీరం దాటనుంది. ఈ తుఫాన్ ఒడిశాలోని 9 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే సంబంధిత 9 జిల్లాలల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు తుఫాన్ తాకిడితో పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధమ్ర పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేసింది. తుఫాన్ ప్రభావంతో గంటకు 150 -160 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనివల్ల 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రకు అతి తీవ్ర యాస్ తుఫాన్ ముప్పు దాదాపు తప్పింది. గంటకు 50 కి.మీ వేగంతో ఉత్తర కోస్తాంధ్రలో బలంగా గాలులు వీస్తున్నాయి. నెల్లూరు దుగరాజపట్నం నుంచి బారువ వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ పేర్కొంది. సముద్రంలో అలలు 2.5 నుంచి 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసి పడతాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున.. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జరీ చేశారు. తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
చదవండి:YS Jagan: అప్రమత్తతతో ఎదుర్కొందాం
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment