
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో ఈడీకీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా రిజాయిండర్ దాఖలుకు అభిషేక్ బోయినపల్లికి రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర 20కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment