![Dharmendra Gets COVID-19 Vaccine Shot To Inspire All - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/19/8888.jpg.webp?itok=FFYcTUU-)
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంబిస్తొంది. ప్రతిరోజు కేసులు సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. దీని వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే కేంద్రం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే దీన్నిచాలా మంది సెలబ్రీటిలు వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. తాజాగా, బాలీవుడ్ హిందీ నటుడు ధర్మేంద్ర కూడా ఆ జాబితాలో చేరిపోయారు. 85 ఏళ్ళవయసులో కొవిడ్19 వ్యాక్సిన్‌ను వేయించుకొని అందరిలోను జోష్‌ను నింపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే, హేమమాలినీ, జితేంద్ర, కమల్‌హసన్, మోహన్‌లాల్, అక్కినేని నాగార్జునా, రాకేష్ రోషన్, పరేష్‌రావల్ తదితరులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఉన్నారు.
ఈ సందర్బంగా ధర్మేంద్ర తన ట్విటర్ ఖాతలో వీడియోను పోస్ట్ చేస్తూ..‘ ఇదేదో చూపించాలని కాదూ’ నన్నుచూసి నా అభిమానులు కూడా వ్యాక్సిన్ వేసుకుంటారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. ‘కర్తే కర్తే..జోష్ ఆగయా..ఔర్ మై నికల్ గయా వ్యాక్సిన్‌లేనే’ ( సోషల్ మీడియా వేదికగా కొవిద్ నిబంధనల పట్ల ట్విట్‌లు చేశాను..నాకు జోష్ వచ్చింది..వెంటనే వ్యాక్సిన్ తీసుకున్నాను.. అని పోస్ట్ పెట్టారు. నా మిత్రులు, ప్రజలు, అభిమానులంతా విధిగా కరొనా వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని కోరారు. ధర్మేంద్ర బాలీవుడ్‌లో అనేక హిట్ సినిమాల్లో నటించారు. షోలే, ఫుల్ ఔర్ పత్తర్, కాజల్, దర్మ్ ఔర్ కానున్, భగవత్ ,చరాస్..వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. ఆయన 2018లో చివరిసారిగా ‘యమ్‌లా పగ్లా దివానా’లో నటించారు. ఈయన తన కుమారులు సన్నీ, బాబీడియోల్‌లతో కలిసి నటించారు.
Comments
Please login to add a commentAdd a comment