
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్(62) కన్నుమూశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స కోసం కె.కె.అగర్వాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
డాక్టర్ అగర్వాల్ హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు హెడ్‌గా పని చేసి.. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించారు. ఆయన 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
— Dr K K Aggarwal (@DrKKAggarwal) May 17, 2021
చదవండి: కరోనా: నేడు ప్రధాని మోదీ సమీక్ష