మైసూరు: కన్నకొడుక్కి హీరో పునీత్ రాజ్‌కుమార్ అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలన్నీ మొదటిరోజే చూసేవాడు. ఏప్రిల్ 1న విడుదలైన యువరత్న సినిమా కోసం ఎన్నోరోజులుగా వేచిచూశాడు. కానీ దురదృష్టశాత్తు అంతకు ముందే కన్నుమూశాడు. అంత దుఃఖంలోనూ తండ్రి బాలుని నిలువెత్తు ఫోటో తీసుకుని థియేటర్‌కు వచ్చాడు. ఫోటోతో కలిసి యువరత్న సినిమా చూసి కొడుకు ఆశ తీరినట్లుగా నిట్టూర్చాడు.
4 నెలల కిందటే మృతి..
మైసూరు కువెంపు నగరకు చెందిన మురళీధర్ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్ నాలుగు నెలల క్రితం స్నేహితునితో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు. యువరత్న సినిమా విడుదలైన రోజే మొదటి ఆట చూడాలని తండ్రితో చెప్పేవాడు. ఈ నేపథ్యంలో యువరత్న ఆడుతున్న ఓ థియేటర్‌కు బాలుని తల్లిదండ్రులు, అన్నయ్య వచ్చారు. తమతో పాటు బాలుని ఫోటోను తీసుకొచ్చి నాలుగు టికెట్లు తీసుకుని సినిమా చూశారు. దాంతో ప్రేక్షకులు ఏమిటని ఆశ్చర్యంతో ఆరా తీయగా అసలు విషయం చెప్పారు.
చదవండి: చిన్నారి ప్రాణం తీసిన పబ్జీ గేమ్ గొడవ!
మానవత్వం అంటే ఇదేనేమో
Comments
Please login to add a commentAdd a comment