ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించడంతో అక్కడ నివసిస్తున్న లక్షాలది పౌరులు ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 20 లక్షల మంది బ్రతుకు జీవుడా అంటూ దేశం విడిచి వెళ్లి పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తరలిస్తోన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గంగా అనే ప్రత్యేక మిషన్ ద్వారా ఎయిరిండియా, వాయుసేన విమానాలను రంగంలోకి దించి విద్యార్థులను తరలిస్తోంది. భారతీయుల తరలింపు ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటి వరకు వేల మంది విద్యార్థులు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. యుద్ధ భూమి నుంచి తమ పిల్లలను క్షేమంగా రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన తన కొడుకు తిరిగి భారత్‌కు చేరుకోవడంతో ఓ తండ్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కశ్మీర్‌కు చెందిన సంజయ్ పండితా అనే వ్యక్తి తన కొడుకును సురక్షితంగా తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ అతను నా కొడుకు కాదు. ఇప్పుడు మోదీ కొడుకే. ఆయనే వెనక్కి తీసుకొచ్చారు. సుమీలో నెలకొన్న పరిస్థితుల్లో నా కొడుకు తిరిగి వస్తాడని అనుకోలేదు. కానీ వచ్చాడు. నా కొడుకుని ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
చదవండి: వారిని కాపాడుకోండి.. జెలెన్ స్కీ వార్నింగ్
#WATCH A tearful Sanjay Pandita from Srinagar, Kashmir welcomes his son Dhruv on his return from Sumy, #Ukraine, says, "I want to say that it's Modiji's son who has returned, not my son. We had no hopes given the circumstances in Sumy. I am thankful to GoI for evacuating my son." pic.twitter.com/ygqOVk5PGm
— ANI (@ANI) March 11, 2022
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ నుంచి వస్తున్న తమ పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు ఢిల్లీలోని విమానాశ్రయం వద్ద అయిదారు గంటలపాటు వేచి చేస్తున్నారు. విద్యార్థులు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రావడంతో వారిని గట్టిగా కౌగిలించుకోవడంతో భావోద్వేగాలు వెల్లువెత్తాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలకు మిఠాయిలు పంచి, పూలమాల వేసి సంతోషపడుతున్నారు. మరికొందరు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలతో స్వాగతం పలుకున్నారు. కాగా సుమీ నగరం నుంచి మూడు విమానాల్లో 674 మంది విద్యార్థులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.
చదవండి: పుతిన్‌కు కోలుకోలేని దెబ్బ.. వెక్కివెక్కి ఏడుస్తున్న రష్యన్ యువతి..
Comments
Please login to add a commentAdd a comment