న్యూఢిల్లీ: ఆరోగ్య విభాగం 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు నిధులు వినియోగించనున్నారు. వీటికి సంబంధించి మొత్తం రూ.8,453.92 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 488 కోట్లు విడుదల చేశారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. అయితే ప్రతిపాదనలు అందిన తర్వాత ఆ రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment