5 రోజుల్లో కరోనాకు చెక్‌.. డీసీజీఏ అనుమతి కోరిన హెటిరో | Hetero Drugs Dcgi Nod Molnupiravir Phase 3 Trial | Sakshi
Sakshi News home page

5 రోజుల్లో కరోనాకు చెక్‌.. డీసీజీఏ అనుమతి కోరిన హెటిరో

Published Fri, Jul 9 2021 2:41 PM | Last Updated on Fri, Jul 9 2021 2:50 PM

Hetero Drugs  Dcgi Nod Molnupiravir Phase 3 Trial - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెటిరో కరోనా చికిత్సలో అత్యవసర వినియోగం కింద మోలినో ఫెరివిర్‌ వాడకానికి శుక్రవారం డీసీజీఏ  అనుమతి కోరింది. టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి రానున్న మోలినో ఫెరివిర్‌ 5 రోజుల్లో కరోనాను తగ్గిస్తుందని హెటిరో సంస్థ వెల్లడించింది. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ టాబ్లెట్ వలన కొవిడ్‌ బాధితులు కోలుకున్నారని హెటిరో తెలిపింది. మోలినో ఫెరివిర్‌ అమెరికాలోని మెర్క్ షార్ప్ & డోహ్మ్ కార్పొరేషన్‌ సంయుక్తంగా  అభివృద్ధి చేస్తున్న  ఔషధం.

ఈ ఏడాది ఏప్రిల్ లో, హెటిరో భారతదేశంలో మోలినో ఫెరివిర్‌ తయారీ, సరఫరా చేయడానికి మెర్క్ షార్ప్ & డోహ్మ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫేజ్-3 ట్రయల్ తాత్కాలిక డేటా ప్రకారం ఈ టాబ్లెట్ వలన కోవిడ్‌ లక్షణాలతో తక్కవగా  ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement