భవిష్యత్తులో జరిగే డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి ప్రత్యేక డ్రోన్లను కొనుగోలు చేయడం కోసం రక్షణ బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యుద్ధ సామర్ధ్యాలను పెంచుకోవాలని సూచిస్తూ.. "ప్రత్యేక డ్రోన్ల కొనుగోలు కోసం రక్షణ బడ్జెట్ లో గణనీయంగా అధిక మొత్తంలో కేటాయింపులు పెంచాలి" అని ఆయన అన్నారు. డ్రోన్ దాడుల నుంచి రక్షించుకోవడానికి ఇజ్రాయిల్ తరహా 'ఐరన్ డోమ్' వంటి టెక్నాలజీ మీద మనం పనిచేయాలని ఆనంద్ మహీంద్రా ట్విటర్ లో పోస్ట్ చేశారు.
జూన్ 27 ఉదయం జమ్మూలోని భారత వైమానిక దళ(ఐఏఎఫ్) కీలక రక్షణ స్థావరాలపై డ్రోన్ల వల్ల రెండు పేలుళ్ళు జరిగాయి. జమ్మూ విమానాశ్రయంలోని ఐఏఎఫ్ స్టేషన్‌పై శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండ బాంబులను జారవిడిచారు. ఈ బాంబు దాడిలో ఇద్దరు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు. రాత్రి 1.40 గంటలకు ఆరు నిమిషాల వ్యవధిలో రెండు బాంబులను జారవిడిచారని అధికారులు తెలిపారు. ఈ పేలుళ్ళలో భవనం పైకప్పు ఒకటి పడటం వల్ల స్వల్ప నష్టం వాటిల్లింది, మరొకటి బహిరంగ ప్రాంతంలో పేలిందని భారత వైమానిక దళం(ఐఎఎఫ్) తెలిపింది. ఎలాంటి ఎక్విప్ మెంట్ కు ఎలాంటి నష్టం జరగలేదు.
Mechanisms of warfare are changing. We have to allocate significantly higher portions of the defence budget for the acquisition of specialised drones. But we also should be working on concepts like the Israeli ‘Iron Dome’ to provide an effective cover from drone attacks. https://t.co/QvaO92Ne5d
— anand mahindra (@anandmahindra) June 29, 2021
Comments
Please login to add a commentAdd a comment