యశవంతపుర: కర్ణాటకలో వారం రోజులుగా కరోనా విజృంభిస్తోంది. మూడు రోజులుగా వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికితోడు పలు కళాశాలలు, హాస్టళ్లపై కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని మల్లేశ్వరం ఈడిగ సముదాయ హాస్టల్‌లో 15 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు బీకాం, బీబీఎం పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో సదరు విద్యార్థులకు శుక్రవారం పీపీఈ కిట్లు వేయించి అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రమైన మహారాణి కళాశాలకు తీసుకెళ్లారు. విద్యార్థులు పీపీఈ కిట్లు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పరీక్షలు రాశారు. అనంతరం సదరు విద్యార్థులను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment