హోం మంత్రి అమిత్ షా
రాయ్‌పూర్: 2026 మార్చినాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తా మని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మావోయిస్ట్ తీవ్రవాదులపై తుది దాడికి నిర్ణాయక, కఠిన వ్యూహం అవసరం ఉందని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ రాజధా ని రాయ్‌పూర్‌లో శనివారం షా మీడియాతో మాట్లాడారు. హింసావాదాన్ని వీడాలని ఆయన నక్సల్స్‌కు పిలుపునిచ్చారు. లొంగుబాట పట్టిన నక్సల్స్ పునరావాసం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒకట్రెండు నెలల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని తెలిపారు.
ప్రజా స్వామ్యానికి పెనుముప్పుగా మారి న నక్సలిజం మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకు 17 వేల మంది ప్రాణాలు కోల్పోయార న్నారు. 2004–14 సంవత్సరాలతో పోలిస్తే 2014–24ల నాటికి దేశంలో నక్సల్ సంబంధిత ఘటనల్లో సగానికి పైగా, అంటే 53 శాతం తగ్గుదల నమోదైంద న్నారు. వామపక్ష తీవ్రవాదా న్ని తుదిదెబ్బ తీసేందుకు భద్రతా లోపాలను సరిచేస్తు న్నామని, భద్రతా సిబ్బందిని కూంబింగ్ ఆపరేషన్లతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగస్వాముల ను చేస్తున్నామన్నారు.
మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీసేందుకు ఎన్‌ఐఏ, ఈడీ వంటి విభాగాలను భద్రతా విభాగాలతో సమన్వయ పరుస్తున్నామని చెప్పారు. బహు ముఖ వ్యూహంతో 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలి స్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా భేటీ
అంతకుముందు, కేంద్ర మంత్రి అమిత్ షా రాయ్‌పూర్‌లో మావోయిస్ట్ నక్సల్స్ ప్రభావిత ఏడు రాష్ట్రాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాలుపంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment