ఢిల్లీ: దేశంలో ఎన్నికల హాడావుడి నడుస్తోంది. ఈసారి ఎన్నికలను అధికార బీజేపీ సహా ప్రతిపక్ష కూటమి నేతలు సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సందట్లో సడేమియాలాగా చైనా జోక్యం జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు మెక్రోసాఫ్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా.. లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్సు ఉంది. ఏఐ ఆధారిత కాంటెంట్‌తో అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయి.
Microsoft warns China is using AI to disrupt upcoming US, South Korean, and Indian elections. pic.twitter.com/AkEJPik0rZ
— Everything you need to know (@Everything65687) April 5, 2024
ఎన్నికల వేళ ఏఐ ఆధారిత కాంటెంట్‌ను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేయనున్నారు. కీలకమైన ఎన్నికలు తమకు అనుకూలంగా ఉండే రీతిలో ఆ ప్రచారం జరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు, ఆడియో రూపంలో ఆ కామెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే, చైనా పొజిషన్‌ను సపోర్టు చేసే రీతిలో వాటిని రూపొందించనున్నారు. అయితే, ఇలాంటి ఎత్తుగడలతో జనరల్ ఎలక్షన్స్‌లో ప్రభావం చూపడం తక్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. చైనా ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేయించిందని తెలిపింది. ఈ విధంగా విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.
Comments
Please login to add a commentAdd a comment