13 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు.. జూలై 10న పోలింగ్‌ | Stage set for Round 2 of INDIA vs NDA as 13 seats in 7 states go to bypolls | Sakshi
Sakshi News home page

ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు.. జూలై 10న పోలింగ్‌

Published Sat, Jul 6 2024 8:46 PM | Last Updated on Sat, Jul 6 2024 8:53 PM

Stage set for Round 2 of INDIA vs NDA as 13 seats in 7 states go to bypolls

న్యూఢిల్లీ: లోక్‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం దేశంలోని ప‌లు అసెంబ్లీ స్థానాల‌కు త్వ‌ర‌లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల‌కు జూలై 10న‌ ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించనుంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.  

వీటిలో ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మూడు, ఉత్త‌రాఖండ్‌లో రెండు, బిహార్‌లో, త‌మిళ‌నాడు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొ స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల మరణం, వివిధ పార్టీలకు నేత‌లు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన నేపథ్యంలో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక ఈ ఎన్నిక‌ల్లోనూ కేంద్ర‌లోని అధికార‌ బీజేపీ, ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మి మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది.

ఈ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జూన్ 14న విడుదలైంది. నామినేషన్‌కు చివరి తేదీ జూన్ 21తో ముగిసింది. జూన్ 24న పరిశీలన కూడా జరిగింది. జూన్ 26న నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో జులై 10న ఓటింగ్ జరగనుంది. జూలై 13న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

కాగా పశ్చిమ బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలైన, రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్,  బాగ్దాలో బీజేపీ కి చెందిన ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి చేరి.. ఇటీవల జ‌రిగిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక మానిక్తలా టీఎంసీ ఎమ్మెల్యే మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది.

ఉప ఎన్నిక‌లు జ‌రిగే అసెంబ్లీ స్థానాలు

  • బిహార్‌- రూపాలీ
  • ప‌శ్చిమ బెంగాల్‌- రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్‌, బాగ్దా, మానిక్తలా

  • హిమాచల్ ప్రదేశ్- డెహ్రా, హమీర్‌పూర్, నలాగర్

  • త‌మిళ‌నాడు- విక్రవాండి 

  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌- అమర్వారా

  • ఉత్తరాఖండ్‌- బ‌ద్రీనాథ్‌, మంగ్లార్ 

  • పంజాబ్‌- జలంధర్ వెస్ట్

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement