ఢిల్లీలో వాయు కాలుష్యం.. కేంద్ర ప్యానెల్‌పై సుప్రీం మండిపాటు | Supreme Court Comes Down Heavily On Delhi Air Quality Panel | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వాయు కాలుష్యం.. కేంద్ర ప్యానెల్‌పై సుప్రీం మండిపాటు

Published Fri, Sep 27 2024 3:32 PM | Last Updated on Fri, Sep 27 2024 3:44 PM

Supreme Court Comes Down Heavily On Delhi Air Quality Panel

న్యూఢిల్లీ: ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో కేంద్ర గాలి నాణ్యత కమిటీపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండపడింది. దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM).. గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి ఎటువంటి కమిటీని ఏర్పాటు చేయలేదని సుప్రీంకోర్టు జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది

చట్టాన్ని పూర్తిగా మరిచారని, ఏ కమిటీలు ఏర్పాటు చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా తెలియజేయాలని కేంద్ర ప్యానెల్‌ను ప్రవ్నించింది. అంతా గాలికి వదిలేశారని మండిపడింది‘ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. ఏదైనా కమిటీని ఏర్పాటు చేశారా? మీరు తీసుకున్న ఒక్క చర్యను మాకు వివరించండి. వాయు కాలుష్య చట్టంలోని సెక్షన్ 12ay ఏ ఆదేశాలను ప్రయోగించారు. అన్నింటినీ గాలికి వదిలేశారు. ఎన్సీఆర్‌ పరిధి ప్రాంతాల్లో ఏం చేశారో చూపించలేదు.’ అని జస్టిస్‌‌ ఓకా పేర్కొన్నారు.

అయితే  CAQM ఎలాంటి చర్య తీసుకోలేదని తాము చెప్పడం లేదు కానీ  ఆశించిన విధంగా పని చేయలేదని బెంచ్ పేర్కొంది. మూడు నెలలకు ఒకసారి తాము సమావేశం అవుతున్నామని  CAQM చైర్మన్ రాజేష్ వర్మ తెలియజేయగా.. సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అంత సమయం సరిపోతుందా? మీరు తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయా? పంట వ్యర్ధాలు తగులబెట్టే సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయా అని కోర్టు ప్రశ్నించింది.

అలాగే తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా చైర్మన్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. రెండు వారాల క్రితమే చైర్మన్‌ చేరారని తెలిపారు. 

పంజాబ్‌, హర్యానా అధికారులు, పొల్యూషన్‌ బోర్డుతో సమావేశాలు జరిగాయని, వారి ప్రధాన కార్యదర్శులకు హెచ్చరికలు జారీ చేశారని CAQM చైర్మన్‌ తెలిపారు. అనంతరం కాలుష్య నియంత్రణకు ఏర్పాటు చేసిన సమావేశాల వివరాలు, చర్యలను తమ ముందుకు తీసుకురావాలని చెబుతూ.. విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement