స్పందన, సంధ్య, పవిత్ర, ఈశ్వర్‌నాయక్ (ఫైల్)
బనశంకరి: ద్వితీయ పీయూసీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఆవేదన చెంది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పాసైనా, 90 శాతం మార్కులు రాలేదని బాధతో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఉత్తరకన్నడ జిల్లా కుమటావాసి ప్రణమ్ ఈశ్వరనాయక్ (18), గదగ తాలూకావాసి పవిత్ర లింగదాళ (18), మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకావాసి ఎంజే స్పందన (17), కొడగు జిల్లా బసవనహళ్లివాసి సంధ్య (17) ఈ అకృత్యానికి పాల్పడ్డారు. వీరిలో అందరూ కూడా ఉరి వేసుకుని తనువు చాలించారు. విశ్రాంత జవాన్ కూతురైన సంధ్య 77 శాతం మార్కులతో ఫస్ట్‌క్లాస్‌లో పాసైంది. కానీ 90 శాతం పైగా వస్తాయని ఆశించి నిరాశకు గురైంది. ఈ బాధతో ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
చదవండి: (ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా)
►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
►మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment