రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్‌గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య తర్వాత ఉదయపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు.
ఇదిలా ఉండగా.. టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య నేపథ్యంలో ఉదయపూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్, పోలీస్ సూపరింటెండెంట్‌తో సహా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి చెందిన 32 మంది అధికారులను బదిలీ చేశారు. కాగా, సున్నితమైన ఈ కేసు దర్యాప్తును దేశంలోని అత్యున్నత ఉగ్రవాద నిరోధక సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి కేంద్ర హోంశాఖ అప్పగించింది. ఈ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు.. కన్హయ్య లాల్ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్య కేసుపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని అన్నారు. హంతకులిద్దరికీ అంతర్జాతీయ ఉగ‍్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ హత్య కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి నేరస్థులను పట్టుకోగలిగామని అన్నారు. ఇదే సమయంలో హంతకులకు ఉగ్రవాద సంస్థలతో ఉన్న లింకులను సైతం కనుగొన్నట్టు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఉదయ్‌పూర్ కంటే వారం ముందే మరో ఘటన!.. అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం
Comments
Please login to add a commentAdd a comment