
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లులపై రాజ్యసభలో పెను దుమారమే చలరేగింది. ఆదివారం ఓటింగ్ సందర్భంగా విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిండు సభలోనే రచ్చ రచ్చ చేశారు. బల్లలపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు ముసాయిదా ప్రతులను చింపివేసి ఉప సభాపతిపైకి విసేరారు. ఇక విపక్ష సభ్యుల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన 8 మంది సభ్యులను వారంపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
వీరిలో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్‌సీ), డోలాసేన్ (టీఎమ్‌సీ), రాజీవ్ వాస్తవ్ (కాంగ్రెస్), రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్), కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు. అయితే రాజ్యసభలో చెలరేగిన రభసకు సంబంధి ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిలో విపక్ష సభ్యుల నిరసన, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విపక్షాల తీరుపై వీడియోను ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్)
Comments
Please login to add a commentAdd a comment