మాట్లాడుతున్న మంత్రి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పక్కన కలెక్టర్ వరుణ్‌రెడ్డి
నిర్మల్ రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ పల్లెలు గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఇందులో తాము భాగస్వాములం అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ మండలం భాగ్యనగర్ గ్రామంలో గురువారం పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు.
కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి మంత్రి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. గ్రామంలోని పారి శుధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం ఐకేరెడ్డి మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయని తెలిపారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.
ప్రతీ గ్రామంలో వైకుంఠధామం, హరితవనం, నర్సరీ, క్రీడా ప్రాంగణం, ట్రాక్టర్ ట్రాలీ తదితర ఎన్నో సౌకర్యాలను సమకూర్చామన్నారు. భూముల రేట్లు పెరుగుతున్నాయని రైతులు భూములను అమ్ముకోవద్దని సూచించారు. దేశంలో రైతులకు కష్టం లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని స్పష్టం చేశారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ప్రతీ గ్రామంలో మంచినీరు, కరెంట్ సమస్య ఉండేదన్నారు. ఇప్పుడు ఆ బాధ తీరిందని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎలా ఉండేవో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలన్నారు. వేడుకల్లో డీపీవో శ్రీలత, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సాయిరాం, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ కారగిరి భూమయ్య, ఉపసర్పంచ్ రాజేందర్, నాయకులు మహేశ్‌రెడ్డి, రామ్‌కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment