టీ(కీ)చకులు! | - | Sakshi
Sakshi News home page

టీ(కీ)చకులు!

Published Fri, Feb 16 2024 11:22 PM | Last Updated on Fri, Feb 16 2024 11:22 PM

- - Sakshi

నిర్మల్‌
● జిల్లాలో మళ్లీ ఘటనలు.. ● గురువుల తప్పుడు చేష్టలు ● బయటకు రానివ్వకుండా ముడుపులు ● గుట్టుగా వేరేచోటుకు డిప్యూటేషన్లు ● పరువు కోసం వెల్లడించని తల్లిదండ్రులు

ఐదేళ్లుగా సమావేశాల్లేవ్‌!

ఆదివాసీ, గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలో మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన సమావేశాలు ఐదేళ్లుగా నిర్వహించడం లేదు.

IIలోu

శనివారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2024

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఖానాపూర్‌: జిల్లా స్థాయి స్పెల్‌ విజార్డ్‌, ఆంగ్లభాష్య నైపుణ్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కె.అక్షయను పాఠశాలలో శుక్రవారం సన్మానించారు. జిల్లా కేంద్రంలో గైడ్‌ టీచర్‌గా శ్రీలత వ్యవహరించగా, మంగళవారం జరిగిన పోటీల్లో జిల్లాస్థాయిలో మొదటిస్థానంలో ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వివరించారు. డీఈవో రవీందర్‌రెడ్డి చేతుల మీదుగా మెమొంటోతోపాటు ప్రశంసాపత్రం అందించారు. పాఠశాలలో హెచ్‌ఎం సంధ్యారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు అభినందించడంతోపాటు ఘనంగా సన్మానించారు.

వ్యాయామ

ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు

నిర్మల్‌ రూరల్‌: కభీర్‌ మండలం పల్సీ ఉన్నత పాఠశాలలో పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని హెదరాబాదులోని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. చాత్ర యువ సంఘర్షణ సమితి జిల్లా వర్కింగ్‌ అధ్యక్షులు శీతల్కర్‌ అరవింద్‌ మాట్లాడుతూ... రెండేళ్లుగా సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే డీఈవో కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. కానీ ఎలాంటి ఫలితం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి సదరు ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

నిర్మల్‌: ‘పిల్లలూ జాగ్రత్త..! సమాజంలో అందరూ మంచోళ్లే ఉంటారనుకోవద్దు. తోడేళ్లలాంటి వాళ్లూ ఉంటారు. పైకి మంచివాళ్లలా నటిస్తూ.. నమ్మించి కాటేస్తారు. జాగ్రత్తగా ఉండాలి..’అంటూ తన పిల్ల ల్లాంటి విద్యార్థులకు చదువులతోపాటు మంచిచెడులు చెప్పాల్సిన గురువులే దారితప్పుతున్నారు. సభ్యత, సంస్కారాలు నేర్పాల్సిన వాళ్లే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ పిల్లల్లాంటి విద్యార్థులపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. సమాజానికి టీచర్‌గా కనిపిస్తూ.. పిల్లలపాలిట కీచకుల్లా మారుతున్నారు. గత ఏడాది ఘటనలను మరువకముందే జిల్లాలో మళ్లీ ఇలాంటివి చోటుచేసుకోవడం తల్లి దండ్రులను కలవరపెడుతోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మనసులో ఉన్నా.. ఎక్కడ తమ పిల్లల పేర్లు బయటకు వస్తే పరువుపోతుందేమోనని తల్లిదండ్రులు బయటకు చెప్పడానికి వెనకాడుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు చేపట్టాల్సిన అధికారులూ దోషులతో కుమ్మక్కవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇదే అలుసుగాకీచక టీచర్ల సంఖ్య పెరుగుతోంది.

విద్యార్థినులతో..

రెండు నెలల క్రితం కుభీర్‌ మండలంలోని ఓ ఉన్నతపాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు చేసిన కీచక చేష్టలు ఇప్పుడు బయటకు వస్తున్నా యి. తమ సార్‌.. అన్న భావనతో దగ్గరకు వచ్చే విద్యార్థినులతో అసాంఘికంగా ప్రవర్తించినట్లు తేలుస్తోంది. తాను చెప్పినట్లు వినని విద్యార్థినులతో ఆయన కక్షపూరితంగా వ్యవహరించినట్లు ఆరో పణలు ఉన్నాయి. వివాహితుడైన సదరు వ్యాయా మ ఉపాధ్యాయుడు 317 జీవోలో ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. ఇలా రావ డం వెనుక ఓ విద్యాశాఖాధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా కుభీర్‌ మండలాని చెందిన ఓ ఉపాధ్యాయుడు, తానూరు మండలానికి చెందిన మరో ఉపాధ్యాయుడిపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. విద్యార్థినులతో ఉపాధ్యాయులే అసభ్యంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు మండిపడుతోంది.

ముందే తెలుసా..!

రెండునెలల క్రితమే సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు చేసిన కీచక చర్యలు విద్యాశాఖలో దాదాపు అందరికీ తెలుసని సమాచారం. ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవోతోపాటు డీఈఓ వరకు దీనిపై ముందే సమాచారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. ఎవరూ సదరు పీఈటీపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అకృత్యాలు బయటకు వచ్చిన తర్వాత సదరు పీఈటీ కొన్నిరోజులపాటు బడికి కూడా రాలేదన్న విషయం తెలుస్తోంది. నెలక్రితం కుభీర్‌ మండలంలోనే మరో గ్రామ ప్రాథమిక పాఠశాలకు సదరు పీఈటీని డిప్యూటేషన్‌పై పంపడం చూస్తుంటే.. విషయమంతా తెలిసే విద్యాశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని సమాచారం. సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొదలు మండల, జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై పలువురు హైదరాబాద్‌ వరకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. జిల్లాలో ౖపైపె విచారణలు, సాదాసీదా చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు.

పరువు పోతుందని..

‘సార్‌..అయిందేదో అయిపోయింది.. ఇలాంటివి బయటకు వస్తే తమ బిడ్డల పరువు పోతుంది..’ అన్న ఆ తల్లిదండ్రుల బాధ, భయమే కీచకటీచర్లకు వరంగా మారుతోంది. ఇక్కడా ఇదేతీరు కనిపిస్తోంది. రెండునెలల క్రితం వ్యాయామ ఉపాధ్యాయుడు పాల్పడిన అకృత్యాలు బయటకు వచ్చినా.. ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రాకపోవడం దారుణం. అలాంటి టీచర్లు తమ గ్రామంలో ఉండొద్దన్న డిమాండ్‌ను మాత్రమే పెడుతున్నారు. ‘ఇక్కడ మీ గ్రామంలో ఇలాంటి ఘటనలకు పాల్పడినవారు.. మరో ఊళ్లో చేయరని గ్యారంటీ ఏంటీ..?’ అన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా.. వాటిపై మహిళలు, విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడమూ కీచకులకు కలిసివస్తోందన వాదన ఉంది.

న్యూస్‌రీల్‌

చర్యలు తీసుకుంటాం..

కుభీర్‌ మండలంలోని ఓ ఉన్నతపాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడి తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే ఆయనను వేరే పాఠశాలకు పంపించాం. ప్రస్తుతం ఈ ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత చట్టపరమైన చర్యలను తీసుకుంటాం.

– రవీందర్‌రెడ్డి, డీఈవో

విద్యార్థినిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు 
1
1/2

విద్యార్థినిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

 ఫిర్యాదుతో శీతల్కర్‌ అరవింద్‌ 
2
2/2

ఫిర్యాదుతో శీతల్కర్‌ అరవింద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement