
సర్కారుబడిలో పూర్వ ప్రాథమిక విద్య
● ప్రైమరీ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ.. ● రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం... ● అమలయితే జిల్లాలోనూ పెరగనున్న ప్రవేశాలు
నిర్మల్‌ఖిల్లా: ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశా ల విద్యాశాఖ నిర్ణయించాయి. నర్సరీ, ఎ ల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టాలని ఆలోచన చే స్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఐదేళ్లలో పు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరగా, ఐదే ళ్లు నిండిన తర్వాతే వారు ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశం పొందుతున్నారు. అయితే, మూడు సంవత్సరాల వయసు నుంచే తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రైవేటు పాఠశాలల్లో చే ర్పించడానికి ఆసక్తి చూపుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందు కు, పూర్వ ప్రాథమిక విద్య ను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అ మలు చేసేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పీ వీ.నరసింహారెడ్డి చర్యలు ప్రారంభించారు. ఈ అంశంపై తాజాగా సచివాలయంలో అధికారులతో చ ర్చలు జరిగాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్ర భుత్వ పాఠశాలల్లో ప్రారంభించే అవకాశం ఉంది.
జిల్లా పరిస్థితి..
జిల్లాలో ప్రస్తుతం ఐదు సంవత్సరాలలోపు పిల్లల కోసం 926 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నా యి. అదే సమయంలో, జిల్లాలో 532 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెడితే, ఈ 532 పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభమవుతాయి. ఈ తరగతులకు విద్యాబోధన బాధ్యతలను అంగన్‌వాడీ ఉపాధ్యాయులు లేదా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించాలా అనే విషయం ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
ప్రయోగాత్మక ప్రారంభం
2025–26 విద్యా సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఈ తరగతులను ప్రారంభించ డం ద్వారా, ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నిర్మల్ జి ల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో గత మూడు విద్యా సంవత్సరాలుగా ఇంగ్లిష్ మీడియం విద్యను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు పూర్వ ప్రాథమిక తరగతులను కూడా ప్రవేశపెట్టడం ద్వారా, పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, తన నివేదికలో కీలక సూచనలు చేశారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.