వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ● డీఈవో రామారావు
లక్ష్మణచాంద: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వడ్యాల్ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో రామారావు అన్నా రు. ఈమేరకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. పాఠశాలను మంగళవారం ఉదయం 8:30 గంటలకు సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. అనంతరం ప్రార్థనలో పాల్గొన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తూ అందరూ ఉన్నత గ్రేడ్‌తో పాస్ అయ్యేలా చూడాలని తెలిపా రు. పాఠశాలకు గైర్హాజర్ అయ్యే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని వారి వి ద్యాభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణంలోని కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో అశోక్‌వర్మ, జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment