తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్య తీసుకోవాలి

Published Wed, Jan 29 2025 12:52 AM | Last Updated on Wed, Jan 29 2025 12:52 AM

తప్పుడు ప్రచారం చేసేవారిపై  చర్య తీసుకోవాలి

తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్య తీసుకోవాలి

నిర్మల్‌టౌన్‌: ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులపై చర్య తీసుకోవాలని ఆదివాసీ నాయకులు ఎస్పీ జానకీ షర్మిలను కోరారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను దుర్భాషలాడుతూ కొంతమంది సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో అంకుశ్‌రావు, తిరుపతి, భూక్యా గోవింద్‌, గోడిస రమేశ్‌, సుంగు, సూర్యభన్‌ ఉన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

నిర్మల్‌టౌన్‌: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నిర్మల్‌ లయన్స్‌ క్లబ్‌, లక్ష్మీకావేరి చారిటబుల్‌ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉద్యోగులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 81 మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్లు రామకృష్ణ, రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. డ్రైవర్ల కళ్లు బాగుంటేనే ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనబడతాయన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్‌ మేనేజర్లు రాజశేఖర్‌, నవీన్‌కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ చంద్రమోహన్‌, సెక్రెటరీ శ్రీనివాస్‌ యాదవ్‌, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement