యూరియా వాడకం తగ్గించాలి
● డీఏవో అంజిప్రసాద్
సోన్: రైతులు పంటలకు యూరియా వాడకం తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ సూచించారు. మండలంలోని సిద్దులకుంటలో తక్కువ యూరియా వినియోగంతో మొక్కజొన్న సాగుచేస్తున్న రైతు కనకపురం ముత్యంరెడ్డి వ్యవసాయ క్షేతాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతు అనుభవాలు తెలుసుకున్నారు. ఎకరాకు కేవలం మూడు బ్యాగుల యూరియాను రెండు దఫాలుగా వేసినట్టు తెలిపాడు. మొక్కజొన్న బోదెల మధ్య దూరం 50 సె.మీ ఉంచడం, సాళ్ల మధ్య సూర్యరశ్మి మొక్కలపై పడటం కారణంగా దోమ, పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉందని రైతు వివరించాడు. ఎకరాకు 45 క్వింటాళ్ల దిగుబడి ఆశిస్తున్నట్లు తెలిపాడు. అనంతరం అంజిప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. నేలలో సేంద్రియ కర్బనశాతం పెరగాలంటే జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని తెలిపారు. దీనివల్ల మిత్ర పురుగులు పెరిగి నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చని పేర్కొన్నారు. ఆయన వెంట ఏవో వినోద్‌కుమార్, ఏఈవోలు అశోక్‌కుమార్, ప్రగతి, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment