రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రానికి సమీపంలోని చిన్న మల్లారెడ్డి క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిన్న మల్లారెడ్డికి చెందిన నలుగురు, లింగంపేట మండలం శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
తాడ్వాయిలో అగ్ని ప్రమాదం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం అ గ్ని ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు తెలి పారు. రూప అనే మహిళ అద్దె ఇంట్లో ఉంటూ శబరిమాత ఆశ్రమం వద్ద ప్యాలాల దుకాణం నడుపుతూ జీవిస్తోంది. శనివారం ఎక్కడి నుంచో వచ్చిన నిప్పురవ్వలు ఇంటిపై పడడంతో ప్లాస్టిక్ తాటిపత్రికి ని ప్పంటుకుందని తెలిపారు. ఇంట్లో మంటలు వ్యా పించడంతో బియ్యం, బట్టలు, ప్యాలాలు, సర్టిఫికెట్లతోపాటు, రెండువేల నగదు కాలిబూడిదైనట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో సుమారు 25వేల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతోంది.
బోధన్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో..
బోధన్: పట్టణంలోని 29వ వార్డు శివాలయం వీధిలో వెండి సాయిలు అనే వ్యక్తి పెంకుటింట్లో శనివారం షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో విలువైన పత్రాలు, కొంత నగదు పాక్షికంగా కాలిపోయాయని, సుమారు రూ.లక్ష వరకు ఆస్తినష్టం వాట్లిలిందని బాధితులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment