నిజామాబాద్
వాతావరణం
ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత తక్కువగా ఉంటుంది.
గౌరవ వేతనం అందేదెన్నడు?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇప్పటి వరకు గౌరవ వేతనం అందలేదు.
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లో u
కూచిపూడి నాట్యంతో
అలరిస్తున్న నాట్య గురువు సరోజ ప్రియదర్శిణి (ఫైల్)
నాట్యంపై మమకారం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ముచ్చటైన హావభావాలతో నాట్యం చేస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తారు. అపారమైన ప్రతిభ గల వీరంతా ఆదర్శవంతమైన నాట్య గురువులుగా రాణిస్తున్నారు. ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ.. చిన్నారులను నాట్యమయూరాలుగా తీర్చిదిద్దున్నారు. తాము నేర్చుకున్న సంప్రదాయ కళకు ప్రాంతీయ రంగు పులుమకుండా కూచిపూడి, పేరిణి నాట్యం, జానపద నృత్య రీతులను చిన్నారులకు నేర్పిస్తున్నారు ఆర్మూర్‌కు చెందిన బాశెట్టి మృణాళిని, సరోజ ప్రియదర్శిణి, జయలక్ష్మిలు. కళామతల్లి సేవలో ఉంటూ వీరి శిష్యులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్న నాట్యగురువులపై ప్రత్యేక కథనం.. – ఆర్మూర్
విజయవాడకు చెందిన వెంకట రమణమ్మ, సాంబశివ శర్మల కూతురు సరోజ ప్రి యదర్శిణి తన 6వ ఏట నుంచే గురువులు పార్వతీశం, శంకర్ వద్ద ఫోక్ డ్యాన్స్ నేర్చుకుంది. 11వ ఏట నుంచి క్లాసికల్ డ్యాన్స్‌ను నేర్చుకోవాలనే తపనతో శైలజారెడ్డి, వేదాంతం రాధేశ్యాంల వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది. 13 ఏళ్ల చిరుప్రాయంలో అరంగేట్రం చేసి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 22 ఏళ్లలో దేశ, విదేశాల్లో 500 పైగా నాట్య ప్రదర్శనలతో వందల సంఖ్యలో అవార్డులను కై వసం చేసుకున్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి చేతుల మీదుగా ఆస్థాన నర్తకి, జాతీయ స్థాయిలో నాట్య విజ్ఞాన్ అవార్డు, కళాపీఠం వారి కళాభూషణ్ అవార్డులు ఆమె నాట్య నైపుణ్యానికి అందిన మచ్చుతునకలు. 2008లో వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన సుధీర్ శర్మతో వివాహం జరగడంతో ఇద్దరు పిల్లలు శివరామకృష్ణ, ప్రోక్షితతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో స్థిరపడ్డారు. 2012లో నిజామాబాద్ కేంద్రంలోని జ్ఞాన సరస్వతీ సంగీత, నృత్య పాఠశాలలో నాట్య గురువు దేవులపల్లి ప్రశాంత్ వద్ద శిష్యరికం చేసి కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేశారు. అదే ఏడాది మామిడిపల్లిలో భారతి నృత్యనికేతన్ (కీర్తన నృత్యనికేతన్)ను స్థాపించారు. కూచిపూడి లాంటి సంప్రదాయ నృత్యాలను చిన్నారులు నేర్చుకోవడంతో వారిలో సనాతన సంస్కృతి, సంప్రదాయాలు అలవడుతాయని తెలుపుతున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని బాశెట్టి మహిపాల్, లక్ష్మి సంతానమైన బాశెట్టి మృణాళిని ఏడేళ్ల ప్రాయం నుంచే నాట్యంపై మక్కువ కనబర్చారు. 2015 లో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆంధ్ర నాట్యంలో పోస్ట్ గ్రా డ్యుయేషన్, కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేశా రు. నాట్య గురువు డాక్టర్ సువర్చల వద్ద శిష్యరికం చేసి నిష్ణాతురాలిగా మారారు. సుమారు 600 పైగా ప్రదర్శనలు ఇచ్చి అవార్డులను కై వసం చేసుకున్నారు. 20 ఏళ్లుగా ఆర్మూర్‌లోని నటరాజ నృత్యనికేతన్‌లో సుమారు వెయ్యి మందికి పైగా చి న్నారులకు కూచిపూడి, ఆంధ్రనాట్యం, పేరిణి నా ట్యం, జానపద నృత్య రీ తులను నేర్పించారు. కూతురు సాయిశృతిని సైతం నృత్య కళాకారిణిగా తీర్చిదిద్దారు. 2024 సెప్టెంబర్‌లో కల్చరల్ అండ్ ఆర్ట్స్ విభాగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
కళా పోషకుడు మాడవేడి..
ఎంతటి కళలైనా సరే పోషకులు లేని పక్షంలో మరుగున పడిపోతా యి. కాగా ఆర్మూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉ పాధ్యాయుడు, రాష్ట్రపతి అవా ర్డు గ్రహీత మాడవేడి నారాయణ కళామతల్లి పోషకుడిగా కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతు న్నారు. 2001 సంవత్సరంలో ఆర్మూర్ పట్టణంలో నటరాజ నృత్యనికేత న్‌ను స్థాపించి 2005లో రిజిస్ట్రేషన్ చేయించారు. నాటి నుంచి పలువురు నాట్య గురువుల సహకారంతో చిందు, కూచిపూడి, ఆంధ్ర నాట్యం, పేరిణి నాట్యం, జానపద నృత్య రీతులను నేర్పి స్తూ సంప్రదాయ కళలను అంపశయ్యపైకి వెళ్లకుండా కాపాడుతున్నారు. అంతరించిపోతున్న చిందుకళను ప్రోత్సహించి ఇందిరాగాంధీ హయాంలో ఢిల్లీలో ప్రదర్శనలిప్పించిన ఘనత నారాయణది. ఆయన స్థాపించిన నటరాజ నృత్యనికేతన్‌లో వెయ్యికి పైగా చిన్నారులు సంప్రదాయ నృత్యరీతులను నేర్చుకోవడం విశేషం.
కాకతీయుల నాటి పేరిణి నాట్యం
కాకతీయ చక్రవర్తుల కాలంలో యుద్ధ సన్నాహక నృత్య విశేషంగా మొదలైందీ పేరిణి నృత్యం. ఇతర శాసీ్త్రయ నృత్యాలకన్నా విశిష్టత కలిగింది. జయపసేనాని మొదలుకొని ఈ నాట్య శైలితో రామప్ప ఆలయ అంతర విగ్రహాలు అలంకరిచబడటం వరకు పేరిణి నృత్య వికాసంలో ప్రతీది విశిష్టాంశమే. ఆ తర్వాత కనుమరుగైపోయిన పేరిణి నృత్యం నటరాజ రామకృష్ణ సారథ్యంలో పునర్వైభవం సంతరించుకున్నది. తెలంగాణలో పేరిణి నృత్యం నవశక్తిగా ఊపిరిపోసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ శాసీ్త్రయ నృత్య రీతి అయిన పేరిణి ద్వితీయ శ్రేణి నృత్య రీతిగానే మిగిలిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర శాసీ్త్రయ నృత్యరీతి అయిన పేరిణి తాండవానికి తెలంగా ణ ఆలయ ఆస్థానాలల్లో లాస్య నర్తనరీతిని కూ డా కలుపుకొని పేరిణి నాట్యంగా రూపుదిద్దుకుంది.
చిన్నారుల్లో తపన ఉండాలి
పేరిణి, ఆంధ్ర నాట్యం, కూచిపూడి లాంటి సంప్రదాయ నృత్యాలను చిన్నారులు నేర్చుకోవడంతో ఏకాగ్రత పెరిగి చదువుల్లో సైతం రాణిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కళామతల్లి సేవలో తరించడం మానసికానందాన్నిస్తోంది. కూచిపూడిని ఆదరిస్తూ తమ పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులు సైతం ఆసక్తి చూపడం ఆనందంగా ఉంది. చిన్నారుల్లో నేర్చుకోవాలనే తపన ఉన్నా పేరిణి నాట్య కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులకు గుర్తింపు రావడం లేదు. ఇలాంటి వారికి ప్రభుత్వ పాఠ్యశాలలో పేరిణి నాట్యాన్ని చేరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – జయలక్ష్మి, సీనియర్ నాట్య గురువు, నిజామాబాద్
న్యూస్‌రీల్
వెయ్యికి పైగా శిష్యులు
బాశెట్టి మృణాళిని, నాట్య గురువు, ఆర్మూర్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment