పెనమలూరు: విద్యుత్‌షాక్‌తో హోటల్ నిర్వాహకురాలు మృతి చెందిన ఘటన యనమలకుదురులో చోటుచేసుకుంది. తాడిగడప డొంక రోడ్డులో నాగిడి వెంకటేశ్వరరావు, నాగిడి దివ్యశ్రీ (35) దంపతులకు ఇద్దరు సంతానం. దివ్యశ్రీ తాడిగడప డొంక రోడ్డులో శ్రీనివాస టిఫిన్ హోటల్ నిర్వహిస్తున్నారు. భర్త రాడ్ బెండింగ్ పనులు చేస్తాడు. గురువారం రాత్రి హోటల్‌లో దివ్యశ్రీ కుమార్తె కావ్యశ్రీ కౌంటర్‌లో కూర్చున్న సమయంలో వర్షం పడింది. పక్కనే విద్యుత్ తీగలు ఉన్నాయి. ఆ కౌంటర్‌ను అవి తాకుతూ వెళ్లాయి. దీంతో దివ్యశ్రీకి స్వల్పంగా కరెంట్ షాక్ కొట్టింది.
అక్కడే ఉన్న వంట మేసీ్త్ర నారాయణ కౌంటర్ జరిపే యత్నం చేయగా అతనికి కరెంట్ షాక్ కొట్టింది. హోటల్ యజమానురాలు దివ్యశ్రీ అది చూసి వంట మేస్త్రి నారాయణను కాపాడటానికి కౌంటర్‌ను లాగే యత్నం చేయగా ఆమెకు విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయింది. ప్రమాదస్థితిలో ఉన్న ఆమెను పటమటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచనలతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న దివ్యశ్రీ ఆస్పత్రిలో గురువారం రాత్రి మృతి చెందింది. ఘటనపై మృతురాలి భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పెనమలూరు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment