నిద్రలేమి.. సమస్యల కొలిమి | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఏకకాలంలో నిద్రపోవాలి...

Published Sat, Aug 26 2023 12:30 AM | Last Updated on Sat, Aug 26 2023 12:12 PM

- - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): విశ్రాంతి పగలంతా శ్రమించిన శరీరానికి ఎంత అవసరమో.. మెదడుకు అంతే అవసరం. ప్రతి మనిషికి రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. కానీ నేటి ఆధునిక కాలంలో మనిషికి అవసరమైన నిద్ర లభించడం లేదు. అర్ధరాత్రి దాటే వరకూ స్మార్ట్‌ ఫోన్‌లతో కాలక్షేపం చేయడం, ఉదయాన్నే లేచి పనుల్లో నిమగ్నం కావడంతో నగర జనాభాలో 50 శాతం మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు అంచనా. మరోవైపు నగరంలో నైట్‌ కల్చర్‌ కూడా బాగా పెరిగింది. అర్ధరాత్రి దాటే వరకూ రోడ్లపైనే యువత ఉంటోంది. ఇలాంటి వారు శారీరక, మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

గుర్తిస్తున్న సమస్యలివే..
అర్ధరాత్రి వరకూ స్మార్ట్‌ఫోన్‌లతో కాలక్షేపం చేసే వారిలో మెలకొనిన్‌ అనే పదార్థం ఉత్పత్తి కాదు. దీంతో సరిగా నిద్రపట్టదు. కాలక్రమేణా దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. ఇలాంటి వారు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది. కోపం, చిరాకు పెరిగిపోతుంటాయి. నిస్సత్తువ ఆవహించి, తెల్లారి లేచిన తర్వాత పనిపై దృష్టి పెట్టలేరు. వాహనాలు నడిపే సమయంలో ఎదురుగా ఏమైనా వస్తుంటే, తుళ్లిపాటుకు గురవుతుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు.

స్మార్ట్‌ఫోన్‌లు, నైట్‌ కల్చర్‌ కాకుండా మరికొందరిలో గురకతో రాత్రివేళల్లో తరచూ తుళ్లిపడి లేస్తుంటారు. శ్వాసనాళాలు మూసుకు పోవడంతో గురకతో పాటు, ఒక్కోసారి గుండెపోటు, మెదడుపోటుకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితిని స్లీప్‌ ల్యాబ్‌లో అధ్యయనం చేస్తారు.

ప్రతి ఒక్కరూ నిద్రలో నాన్‌ రాపిడ్‌ ఐ మూమెంట్‌(ఎన్‌ఆర్‌ఈఎం), రాపిడ్‌ ఐ మూమెంట్‌ (ఆర్‌ఈఐ)అనే రెండు రకాల నిద్ర ఉంటుంది. ఇది గంటన్నరకు ఒకసారి సైకిల్‌ మారుతుంటుంది. కానీ కొందరికి రెండు కలిసి పోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో నిద్రలోనే లేచి నడవడం వంటివి చేస్తుంటారు.

సుఖ నిద్రకు సూచనలు..

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు శరీర తత్వాన్ని బట్టి రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. వయస్సు పెరిగే కొద్ది నిద్ర అవసరం తగ్గుతుంది.

ఒకేసారి ఏకకాలంలో నిద్రపోవాలి. 4 గంటలు ఒకసారి, రెండు గంటలు మరోసారి కాదు.

గాఢ నిద్రకోసం బెడ్‌రూమ్‌ను చీకటిగా ఉంచుకోవడంతో పాటు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి.

ప్రతి రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, లేవడం చేయాలి.

నిద్రలోనే మెదడులోని వ్యర్థాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

విద్యార్థులకు సరిగా నిద్రలేక పోతే రాత్రి చదివినవి ఉదయానికి గుర్తుండవు.

మానసిక సమస్యలు..

నిద్రలేమితో అనేక మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కోపం, చిరాకు, ఆందోళనతో పాటు, కొందరు డిప్రెషన్‌కు గురవుతారు. విద్యార్థులకు చదివిన పాఠ్యాంశాలు గుర్తుండవు. ఉదయాన్నే లేచి పనిపై దృష్టి పెట్టలేరు. నిస్సత్తువ ఆవహిస్తుంది. కాన్ఫిడెంట్‌గా వాహనాల డ్రైవింగ్‌ చేయలేరు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేక తుళ్లిపాటుకు గురవుతుంటారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 6 గంటలు నిద్రపోవాలి. అదికూడా ఏకకాలంలోనే పోవాలి.

– డాక్టర్‌ వి రాధికారెడ్డి,

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement