విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Thu, Jan 30 2025 1:25 AM | Last Updated on Thu, Jan 30 2025 1:25 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
గురువారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2025

దేశ భద్రత

మనందరి బాధ్యత

కోస్ట్‌గార్డు కమాండెంట్‌ మురళీ

కోనేరుసెంటర్‌: దేశ భద్రత మనందరి బాధ్యత అని కోస్ట్‌గార్డ్‌ కమాండెంట్‌ కె. మురళీ అన్నారు. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ రైజింగ్‌ డేను పురస్కరించుకుని విశాఖపట్నం నుంచి బైక్‌లపై ర్యాలీగా బందరు చేరుకున్న కోస్ట్‌గార్డ్‌ అధికారులు గురువారం గిలకలదిండిలోని మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మురళీ మాట్లాడుతూ దేశ భద్రతకు సంబంధించి భద్రతా దళాలకు ఎంత బాధ్యత ఉంటుందో దేశ పౌరులకూ అంతే బాధ్యత ఉంటుందన్నారు. సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇతర ప్రాంతాల నుంచి మన సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల సమాచారం తెలిసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నారు. అలాంటి సంఘటనలు తారస పడితే తక్షణమే అందుబాటులోని కోస్ట్‌గార్డ్‌, మైరెన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి దేశ రక్షణలో భాగస్వాములు కావాలన్నారు. అలాగే వేటకు వెళ్లే మత్స్యకారులు సముద్రంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా లైఫ్‌జాకెట్‌లను వెంట తీసుకువెళ్లాలన్నారు. సముద్రంలో మద్యం తాగ డం వంటి చర్యలకు పాల్పడకూడదన్నారు.

సరిహద్దులు దాటొద్దు..

గిలకలదిండి మైరెన్‌ ఎస్‌ఐ చంద్రబోస్‌ మాట్లాడుతూ బోట్లు మన సరిహద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లైసెన్స్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. బోట్లకు నంబర్‌లను తప్పనిసరిగా వేయించాలన్నారు. అలాగే బోట్లపై జాతీయజెండా ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో కోస్ట్‌గార్డ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ శివబాలన్‌, జేజి ప్రకాష్‌, ఆనంద్‌ కుమార్‌ కరోడా, హార్తిఆచార, గిలకలదిండి మైరెన్‌ ఎస్‌ఐ పరింకాయల మురళీకృష్ణ, మత్స్యకారులు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలలపై కూటమి సర్కార్‌ కత్తి కట్టింది. వివిధ కారణాలు చూపుతూ రద్దు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలను ప్రారంభించకపోయినా కొంతమంది ప్రముఖులు వివిధ సొసైటీల ద్వారా పాఠశాలలను స్థాపించి విద్యాభ్యున్నతికి పాటుపడుతున్నారు. స్వాతంత్య్రం రాక మునుపే సుమారు 150ఏళ్ల నుంచి జిల్లాలో ఎయిడెడ్‌ పాఠశాలలను ఆయా సొసైటీలు ప్రారంభించి నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో ప్రభుత్వం సిబ్బందికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇవ్వటం ద్వారా కొంత ఆ విద్యాసంస్థలకు అండగా నిలుస్తోంది. అయితే తాజాగా కూటమి సర్కార్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలను తగ్గించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

త్రీమెన్‌ కమిటీ నియామకం..

ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలల పరిశీలన కోసం రెండు మాసాల క్రితం త్రీమెన్‌ కమిటీని నియమించింది. అందులో వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సభ్యులుగా నియమించింది. వారు ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, వసతులను నియమ నిబంధనల ప్రకారం ఉన్నదీ లేనిది చూడటమే కాకుండా ఇప్పటి వరకూ ఏ విధంగా కొనసాగుతున్నది తదితర అంశాలను పరిశీలిస్తారు. దాని కోసం ప్రభుత్వం కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసి వాటికనుగుణంగా వివరాలను రాబట్టేందుకు మార్గదర్శకం చేసింది. దాదాపు 25 ప్రశ్నలున్నట్లు తెలుస్తోంది. వాటిని పరిశీలించి సంతృప్తి చెందినట్లుగా లేదా అసంతృప్తిగా ఉన్నట్లుగా నివేదికలో పొందుపరచాల్సి ఉంది.

జిల్లాలో ఎయిడెడ్‌ పాఠశాలలు..

ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రస్తుతం 54 ఎయిడెడ్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. అందులో సుమారుగా 20 వరకూ ప్రాథమిక పాఠశాలలు కాగా 18 వరకూ ఉన్నత పాఠశాలలుగా ఉన్నాయి. అలాగే మిగిలినవి 16 ప్రాథమికోన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు 1:20 నిష్పత్తిలో, ఉన్నత పాఠశాలలకు 1:40 నిష్పతిలో ఉపాధ్యాయ, విద్యార్థుల సంఖ్య ఉండాలని నిబంధనలు సూచిస్తున్నాయి. అలాగే సబ్జెక్ట్‌ టీచర్లు, పీడీ, ఎన్‌సీసీ వంటి విభాగాలకు సంబంధించి కొంత సంఖ్య పెరిగే అవకాశముంటుంది. అయితే వీటికి సంబంధించిన అంశాలను ఆధారంగా చేసుకొని ఎయిడెడ్‌ వ్యవస్థపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని విద్యాశాఖకు చెందిన వర్గాలు వివరిస్తున్నాయి.

ఇతర జిల్లాల్లో ప్రారంభమైన బదిలీలు..

రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల బదిలీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సెలవులకు ముందు రెండు రోజుల వ్యవధి ఇచ్చి బదిలీ ఉత్తర్వులను ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు జారీ చేశారు. సెలవులు ప్రారంభం కాక ముందు బదిలీ చేసిన పాఠశాలలో రిపోర్ట్‌ చేయాలని ఆయా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాంతో ఆ విధమైన చర్యలు ఎన్టీఆర్‌ జిల్లాలోనూ కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.

కార్యాలయ సిబ్బంది సైతం..

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పని చేసే కార్యాలయ సిబ్బందిని సైతం బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని పాఠశాలల్లో కార్యాలయ సిబ్బంది ఇతర ప్రాంతాలకు బదిలీ చేయటంతో అక్కడ ఉపాధ్యాయులే ఆ పనులను నిర్వహిస్తున్నారు. దాంతో ఇతర ఉపాధ్యాయులపై వర్క్‌లోడ్‌ పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి.

గతంలో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు

గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చేపట్టిన చర్యల నేపథ్యంలో కూటమి నేతలు నాటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని హడావుడి చేయటమే కాకుండా ఉపాధ్యాయ సంఘాలను రెచ్చగొట్టినట్లుగా ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాక పూర్తిగా ఎయిడెడ్‌ విద్యాసంస్థలను రద్దు చేసేందుకు కుట్రలు చేయటంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

7

న్యూస్‌రీల్‌

ఎయిడెడ్‌ పాఠశాలలపై సర్కార్‌ కత్తి

పరిశీలన పేరుతో గ్రాంట్‌ నిలిపివేసేందుకు కుట్ర అందుకోసం త్రీమెన్‌ కమిటీ నియామకం విద్యార్థుల సంఖ్య, వసతుల లేమి పేరుతో సిబ్బందిని ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు చర్యలు జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్నవి 54 ఎయిడెడ్‌ పాఠశాలలు వీటిలో పది వరకూ మూతపడే అవకాశం 150 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలు

పది పాఠశాలలు మూత!

జిల్లాలో 54 ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 10 నుంచి 15 వరకూ మూతపడే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాల్లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలు అందిస్తున్న సేవలు అపూర్వమని, అటువంటి పాఠశాలలను రద్దు చేసేందుకు ప్రయత్నించటం సరికాదని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సెయింట్‌ ఆంథోని ఆర్‌సీఎం గరల్స్‌ హైస్కూల్‌లో అత్యధికంగా 539 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఉపాధ్యాయులు 15 మంది మాత్రమే కొనసాగుతున్నారు. అలాగే సత్యనారాయణపురంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇలా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ6
6/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ7
7/8

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ8
8/8

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement