
ఆశ.. నిరాశ
● టీడీపీ నేతలను ఊరిస్తున్న ఎమ్మెల్సీ పదవులు ● ఎమ్మెల్సీ కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురి పోటీ ● చంద్రబాబు, చినబాబు చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు ● సొంత పార్టీలోనే పలువురికి మోకాలడ్డు ● దేవినేని ఉమా ఆశలు ఈసారైనా ఫలించేనా?
ఎమ్మెల్సీ హామీ
కూరలో
కరివేపాకులా..
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే సంకేతాలు టీడీపీ అధిష్టానం నుంచి ఇంత వరకూ అందలేదని సమాచారం. చివరి క్షణంలోనైనా అవకాశం దక్కుతుందనే భావనలో ఆయన వర్గీయలు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వాడుకొని ఎన్నికల తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందనే భావనను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రస్తుతం ఆ ఊసే టీడీపీ అధిస్టానం ఎత్తడం లేదని పలువురు స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాడు కొని కూరలో కరివేపాకులా తీసి వేసినా ఆశ్చర్యం లేదని వారు స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో తమకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చాక కనీసం దగ్గరకు కూడా రానివ్వటం లేదని పలువురు వాపోతున్నారు. మొత్తం మీద ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు అవకాశం లేనట్టేననే భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చంద్రబాబు, చినబాబును ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీకి కష్ట కాలంలో వెన్నంటి ఉండి పలు పోరాటాలు చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తు న్నాయి. ప్రస్తుతం పలువురు నేతలు చంద్ర బాబును కలిసి ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని వేడుకొంటున్నారు. ఆయన చినబాబును కలవండి అంటూ ఉచిత సలహాలు ఇస్తుండటంతో వారు నివ్వెరపోతున్నారు. చినబాబుతో అయ్యేదేమీ లేదని ఎమ్మెల్సీ పదవులపై ఆశలు వదులుకొంటున్నారు. వారు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోన రగిలిపోతున్నారు. చినబాబు సీనియర్లను పక్కన పెట్టి తన సొంత టీంను సిద్ధం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగా డబ్బు మూటలతో పాటు, తన సొంత కోటరీకే ప్రాధాన్యం ఇస్తున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవిపై ఆశల పల్లకీలో ఊరేగుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, పార్టీ నాయ కులు బుద్దా వెంకన్న, వంగవీటి రాధాతోపాటు పలువురికి చాన్స్ ఉండదేమోననే భావన టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
పాపం..ఉమా
టీడీపీలో నేనే నంబరు–2 అనే స్థాయిలో బీరాలు పలికే మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ప్రస్తుతం పార్టీలో కుడితిలో పడ్డ ఎలుకలా దయనీయంగా మారింది. ఎమ్మెల్సీ పదవి కోసం కాలు కాలిన పిల్లిలా అధిష్టానం చుట్టూ తిరుగుతూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. పార్టీలో కొంత మంది ఈ సారీ ఉమాకు అవకాశం లేదనే భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు దేవినేని ఉమాకు ఎమ్మెల్సీ పదవి దక్కకుండా టీడీపీ పార్లమెంటు ప్రజాప్రతినిధి, మైలవరం ప్రజాప్రతినిధి గట్టి ప్రయత్నం చేస్తున్నారనే చర్చ టీడీపీలోనే సాగుతోంది. వారు ఇద్దరు చినబాబుకు సన్నిహితంగా ఉండటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఇందులో భాగంగానే వారిద్దరూ ఎమ్మెల్సీ పదవి కోసం నెట్టెం రఘురాం పేరును తెరపైకి తెచ్చి మద్దతు తెలుపుతున్నారు. దేవినేని ఉమాకు అవకాశం దక్కకుండా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ సొంత సామాజిక వర్గానికే కేటాయించడం కూడా అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
బుద్దాకు మొండి చెయ్యేనా?
పేవరు పులిగా పేరొందిన బుద్దా వెంకన్న పరిస్థితి అధిష్టానం వద్ద ఆధ్వానంగా ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. మాటకు ముందు వైఎస్సార్ సీపీపై ప్రెస్ మీట్లు పెట్టి ఒంటికాలిపై లేస్తే తనకు అవకాశం దక్కుతుందనుకున్న ఆయనకు అధిష్టానం వద్ద అంతసీన్ లేదంటున్నారు. చంద్రబాబు, చినబాబు ఇద్దరూ బుద్దాను పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. దీనికితోడు పార్లమెంటు ప్రజాప్రతినిధితో పాటు, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధి నుంచి ఇతనికి సహకారం పూర్తిగా కొరవడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ప్రస్తుతం బుద్దా పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదనే భావనను టీడీపీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, నాగుల్ మీరా, ఎంకే బేగ్ వంటి పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తుండటం గమ నార్హం. సామాజిక సమీకరణలను తీసుకున్నా బుద్దా వెంకన్నకు మైనస్‌గా మారే అవకాశం ఉందని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment