కూచిపూడి(మొవ్వ): ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలను పురస్కరించుకుని కూచిపూడి నాట్య కళాకారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఏ బాల కొండలరావు (విశాఖపట్నం)ను కూచిపూడి నాట్య క్షేత్రంలో సోమవారం ఘనంగా సత్కరించారు. కూచిపూడి శిల్పారామం వ్యవస్థాపకుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం జరిగింది. ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు, దీవి శ్రీ రంగా చార్యులు, పిన్నమనేని గోపాల కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏ బాలకొండలరావ రావు శిష్యులతో పాటు పలువురు నాట్యకళాకారులు కూచిపూడి నాట్యాంశాలను ప్రదర్శించి, ప్రేక్షకులను మన్నలను అందుకున్నారు.
ఉద్యోగవిరమణ చేసిన సిబ్బందికి సత్కారం
కోనేరుసెంటర్: ఆరోగ్యమే మహాభాగ్యమని సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది తమ శేష జీవితాన్ని సంతోషంతో పాటు ఆరోగ్యవంతంగా గడిపేలా వారిని ఆశీర్వదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగవిరమణ పొందిన ఎస్‌ఐ ఏకే జిలాని (ఎస్‌ఐ–777), ఏఎస్‌ఐ వీఎస్‌ఎస్ ప్రసాద్ (ఏఎస్‌ఐ–935)లను సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగమనే సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి, ఉద్యోగ విరమణ వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం అదృష్టంగా భావించాలన్నారు. ఇది అందరికీ సాధ్యం కాదని అన్నారు. ఉద్యోగవిరమణ పొందిన ప్రతి ఒక్కరూ శేష జీవితాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలన్నారు.
బాలకొండలరావుకుఘన సత్కారం