భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి దట్టమైన అడవుల్లో భారీగా గంజాయి బస్తాలను బొయిపరిగుడ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి 11 క్వింటాళ్ల 58 కేజీల 600 గ్రాములు ఉన్నట్లు పోలీసు అధికారి దీపాంజళీ ప్రదాన్ గురువారం వెల్లడించారు. బుధవారం కొంత మంది గ్రామీణులు అడవిలో వెళ్తుతుండగా వారికి ఒకచోట తెల్లని సంచులు తుప్పల్లో ఉండటం కని పించింది. వెంటనే వారు బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీస్ అధికారి దీపాంజళీ ప్రదాన్ ఆదేశాల మేరకు వెంటనే వెళ్లి దర్యాప్తు చేపట్టినట్లు సబ్‌ఇన్‌స్పెక్టర్ కష్ణ చంద్ర సెఠి తెలిపారు. ఇన్‌స్పెక్టర్ తన టీమ్‌తో బొయిపరిగుడ సమితి సెమిలిపొదర్ ప్రాంతంలోని దట్టమైన ఆడవుల్లో దాడులు చేశారు. వారికి గంజాయి బస్తాలు కనిపించగానే అప్రమత్తమై ఎవరు కనిపించినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. సమీపంలో ఎవరూ కనించకపోవటంతో బస్తాలను విప్పి చూడగా గంజాయి బయటపడింది. బస్తాలను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి తూకం వేయించారు. గంజాయిని దాచిన మాఫియాలో ఎవరూ పట్టబడలేదని పోలీసులు వెల్లడించారు. గంజాయిని ఇతర ప్రాంతాల వారికి అమ్మేందుకు మాఫీయా ఎవరికీ కనిపించకుండా అడవిలో దాచి పెట్టారని, నిందితులను త్వరలో పట్టుకుంటమని పోలీసు అధికారి ప్రదాన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment